‘‘సర్వ హద్దుల నుండి బయటకు వచ్చి అనంతమైన వైరాగిగా అవ్వండి’’
ఈరోజు కల్పం తర్వాత మళ్ళీ మిలనం జరుపుకునేందుకు పిల్లలందరూ తమ సాకారీ స్వీట్ హోమ్ అయిన మధుబన్కు చేరుకున్నారు. సాకార వతనం యొక్క స్వీట్ హోమ్ మధుబన్. ఇక్కడ తండ్రి, పిల్లల ఆత్మిక మేళా జరుగుతుంది. మిలన మేళా జరుగుతుంది. కావున పిల్లలందరూ మిలన మేళాకు వచ్చారు. తండ్రి మరియు పిల్లల యొక్క ఈ మిలన మేళా కేవలం సంగమయుగంలోనే మరియు మధుబన్లోనే జరుగుతుంది, అందరూ పరుగులు తీస్తూ మధుబన్కు చేరుకున్నారు. మధుబన్ బాప్‌దాదాతో సాకార రూపంలో కూడా మిలనం చేయిస్తుంది మరియు దానితో పాటు సహజ స్మృతి ద్వారా అవ్యక్త మిలనాన్ని కూడా చేయిస్తుంది ఎందుకంటే మధుబన్ ధరణికి ఆత్మిక మిలనం యొక్క అనుభూతిని మరియు సాకార రూపంలో మిలనం యొక్క అనుభూతిని చేయించే వరదానము లభించి ఉంది. వరదానీ ధరణి అయిన కారణంగా మిలనం యొక్క అనుభవాన్ని సహజంగా చేస్తారు. వేరే ఏ స్థానంలోనూ జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన నదుల యొక్క మిలన మేళా జరగదు. సాగరము మరియు నదుల యొక్క మిలన మేళా జరిగే స్థానము ఇది ఒక్కటే. ఇటువంటి మహాన్ వరదానీ ధరణిపైకి వచ్చారు - ఈ విధంగా భావిస్తున్నారా?
తపస్యా సంవత్సరంలో విశేషంగా ఈ కల్పంలో మొదటిసారి కలుసుకునేటువంటి పిల్లలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది. మీరు ఎంత భాగ్యశాలురు! తపస్య యొక్క ఆదిలోనే కొత్త పిల్లలకు ఎక్స్ట్రా బలం లభించింది. కనుక ఆదిలోనే లభించిన ఈ ఎక్స్ట్రా బలము భవిష్యత్తులో ముందుకు వెళ్ళేందుకు సహయోగిగా అవుతుంది, అందుకే కొత్త పిల్లలకు డ్రామా కూడా ముందుకు వెళ్ళేందుకు సహయోగమిచ్చింది. అందుకే, మేమైతే వెనుక వచ్చాము అన్న ఫిర్యాదును చేయలేరు. అలా కాదు. తపస్యా సంవత్సరానికి కూడా వరదానం లభించి ఉంది. తపస్యా సంవత్సరంలో వరదాని భూమిపైకి వచ్చే అధికారం లభించింది, అవకాశం లభించింది. ఈ ఎక్స్ట్రా భాగ్యము తక్కువేమీ కాదు. ఈ సంవత్సరము, ఈ మధుబన్ ధరణి మరియు తమ పురుషార్థము - ఈ మూడు వరదానాలు విశేషంగా కొత్త పిల్లలైన మీకు లభించాయి. కనుక ఎంత భాగ్యశాలురుగా అయ్యారు! ఇంతటి అవినాశీ భాగ్యం యొక్క నషాను తమతో ఉంచుకోండి. కేవలం ఇక్కడి వరకు మాత్రమే నషా ఉండడం కాదు, తండ్రి అవినాశీ, శ్రేష్ఠాత్మలైన మీరు అవినాశీ, కావున భాగ్యము కూడా అవినాశీ. అవినాశీ భాగ్యాన్ని అవినాశీగా ఉంచుకోండి. ఇది కేవలం సహజమైన అటెన్షన్ ఇచ్చే విషయము. టెన్షన్‌తో కూడిన అటెన్షన్ కాదు, సహజమైన అటెన్షన్ ఉండాలి, అయినా ఏం కష్టముంది? నా బాబాను తెలుసుకున్నారు, స్వీకరించారు, ఎవరినైతే తెలుసుకున్నారో, స్వీకరించారో, అనుభవం చేసారో, అధికారం ప్రాప్తించిందో, అప్పుడిక కష్టమేముంది? కేవలం బాబా ఒక్కరే నా వారు - ఇది అనుభవమవుతూ ఉండాలి. ఇదే సంపూర్ణ జ్ఞానము.
ఒక్క ‘‘బాబా’’ అనే పదంలో మొత్తం ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇమిడి ఉంది ఎందుకంటే వారు బీజము కదా. బీజంలోనైతే మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంటుంది కదా. విస్తారాన్ని మర్చిపోవచ్చు కానీ సారము ఒక్క బాబా అనే పదము - ఇది గుర్తుండడము కష్టము కాదు. సదా సహజము కదా! అప్పుడప్పుడు సహజము, అప్పుడప్పుడు కష్టమా. బాబా సదా నా వారా లేక అప్పుడప్పుడు నా వారా. బాబా సదా నా వారు అన్నప్పుడు స్మృతి కూడా సదా సహజముగా ఉంటుంది. ఇది కష్టమేమీ కాదు. భగవంతుడు, మీరు నా వారు అని అన్నారు మరియు మీరు, మీరు నా వారు అని అన్నారు. ఇక కష్టమేముంది? అందుకే విశేషంగా కొత్త పిల్లలు ఇంకా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఇప్పుడింకా ఫైనల్ సమాప్తి యొక్క విజిల్ మోగలేదు. అందుకే ఎగరండి మరియు ఇతరులను కూడా ఎగిరేలా చేస్తూ వెళ్ళండి. దీనికి విధి ఏమిటంటే, వేస్టును అనగా వ్యర్థాన్ని ఆపు చేయండి. పొదుపు ఖాతాను, జమ ఖాతాను పెంచుకుంటూ వెళ్ళండి ఎందుకంటే 63 జన్మల నుండి పొదుపు చేయలేదు కానీ పోగొట్టుకున్నారు. అన్ని ఖాతాలను వ్యర్థంగా పోగొట్టుకుని సమాప్తం చేసేసారు. శ్వాస యొక్క ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, సంకల్పాల ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, సమయం యొక్క ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, గుణాల ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, శక్తుల ఖజానాను కూడా పోగొట్టుకున్నారు, జ్ఞానం యొక్క ఖజానాను కూడా పోగొట్టుకున్నారు. ఎన్ని ఖాతాలు ఖాళీ అయిపోయాయి! ఇప్పుడు ఈ ఖాతాలన్నింటినీ జమ చేసుకోవాలి. జమ అయ్యే సమయము కూడా ఇప్పుడే ఉంది మరియు జమ చేసుకునే విధి కూడా తండ్రి ద్వారా సహజంగా లభిస్తూ ఉంది. వినాశీ ఖజానాలు ఖర్చు చేయడంతో తగ్గిపోతాయి, తరిగిపోతాయి మరియు ఈ ఖజానాలన్నింటినీ ఎంతగా స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల శుభమైన వృత్తితో కార్యంలో ఉపయోగిస్తారో, అంతగా అవి జమ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఖజానాలను కార్యంలో ఉపయోగించడము - ఇది జమ చేసుకునే విధి. అక్కడ ఉంచుకోవడము జమ చేసుకునేందుకు విధి మరియు ఇక్కడ ఉపయోగించడము జమ చేసుకునేందుకు విధి. తేడా ఉంటుంది. సమయాన్ని స్వయం పట్ల లేక ఇతరుల పట్ల శుభ కార్యాలలో ఉపయోగించినట్లయితే జమ అవుతూ ఉంటుంది. జ్ఞానాన్ని కార్యంలో ఉపయోగించండి. అదే విధంగా గుణాలను మరియు శక్తులను ఎంతగా ఉపయోగిస్తారో, అవి అంతగా పెరుగుతాయి. ఇలా ఆలోచించకండి - ఏ విధంగానైతే వారు లాకరులో పెట్టుకుని, నా వద్ద చాలా జమ అయి ఉంది అని భావిస్తారో, అలా మీరు కూడా నా బుద్ధిలో చాలా జ్ఞానం ఉంది, గుణాలు కూడా నాలో చాలా ఉన్నాయి, శక్తులు కూడా ఉన్నాయి అని ఆలోచించడం కాదు. వాటిని లాకప్ చేసి పెట్టుకోకండి, ఉపయోగించండి. జమ చేసుకునే విధి ఏమిటో అర్థమయిందా? కార్యంలో ఉపయోగించడము. స్వయం పట్ల కూడా ఉపయోగించండి, లేదంటే పోగొట్టుకుంటారు. చాలామంది పిల్లలు, నాలో సర్వ ఖజానాలు చాలా ఇమిడి ఉన్నాయి అని అంటారు. కానీ ఇమిడి ఉన్నాయి అన్నదానికి గుర్తు ఏమిటి? ఇమిడి ఉన్నాయి అనగా జమ అయి ఉన్నాయి. కనుక వాటి గుర్తు ఏమిటంటే- స్వ పట్ల మరియు ఇతరుల పట్ల సమయానికి కార్యంలో ఉపయోగపడాలి. కార్యంలోకి రానే రావు కానీ చాలా జమ ఉంది, చాలా జమ ఉంది అని అంటారు. కావున దీనిని జమ చేసుకునే యథార్థ విధి అని అనము, కావున ఒకవేళ యథార్థ విధి లేకపోతే సమయానికి సంపూర్ణత యొక్క సిద్ధి లభించదు. మోసపోతారు. సిద్ధి లభించదు.
గుణాలను, శక్తులను కార్యంలో ఉపయోగించినట్లయితే పెరుగుతూ ఉంటాయి. కావున పొదుపు చేసే విధిని, జమ చేసే విధిని అలవర్చుకోండి. అప్పుడు వ్యర్థం యొక్క ఖాతా స్వతహాగానే పరివర్తన అయి సఫలమవుతుంది. ఏ విధంగానైతే భక్తి మార్గంలో ఈ నియమం ఉంటుంది, అదేమిటంటే, మీ వద్ద స్థూల ధనం ఎంత ఉన్నా సరే, దానిని దానం చేయండి, సఫలం చేయండి, అప్పుడు అది పెరుగుతూ ఉంటుంది అని అంటారు. సఫలం చేసుకునేందుకు భక్తిలో కూడా ఉల్లాస-ఉత్సాహాలను ఎంతగా పెంచుతారు. మీరు కూడా తపస్యా సంవత్సరంలో కేవలం వ్యర్థంగా ఎంత పోగొట్టుకున్నాము అన్నది మాత్రమే చెక్ చేసుకోకండి. వ్యర్థంగా పోగొట్టుకోవడము, అది వేరే విషయము. కానీ ఖజానాలన్నీ ఏవైతే వినిపించారో, వాటిని ఎంత సఫలం చేసాము అన్నది చెక్ చేసుకోండి. గుణాలు కూడా తండ్రి ఇచ్చిన కానుక. ఇది నా గుణము, నా శక్తి - స్వప్నంలో కూడా ఈ పొరపాటు చేయకండి. ఇది తండ్రి ఇచ్చిన కానుక అనగా ప్రభువు ఇచ్చిన కానుక, పరమాత్మ ఇచ్చిన కానుకను నాదిగా భావించడము అంటే - అది మహాపాపము. చాలాసార్లు చాలామంది పిల్లలు సాధారణ భాషలో ఇలా ఆలోచిస్తారు కూడా మరియు మాట్లాడుతారు కూడా - నా ఈ గుణాన్ని ఉపయోగించడం లేదు, నాలో ఈ శక్తి ఉంది, నా బుద్ధి చాలా మంచిది, దానిని ఉపయోగించడం లేదు. ‘‘నాది’’ అన్నది ఎక్కడి నుండి వచ్చింది? ‘‘నాది’’ అని అన్నారంటే మురికిగా అవుతారు. భక్తిలో కూడా ఈ శిక్షణను 63 జన్మలుగా ఇస్తూ వచ్చారు - నాది అని భావించకండి, నీదిగా భావించండి అని. అయినా కూడా అలా భావించలేదు. అలాగే జ్ఞాన మార్గంలో కూడా అనడానికి నీది అని అంటూ, నాదిగా భావిస్తే - ఆ మోసము ఇక్కడ నడవదు, అందుకే ప్రభువు ప్రసాదించినదానిని తమదిగా భావించడము అంటే - ఇది అభిమానము మరియు అవమానపర్చడము. ‘‘బాబా-బాబా’’ అన్న పదమును ఎక్కడా కూడా మర్చిపోకండి. బాబా శక్తినిచ్చారు, బుద్ధినిచ్చారు, ఇది బాబా కార్యము, ఇది బాబా సెంటరు, అన్ని వస్తువులు బాబావే. నా సెంటరు, నేను కట్టించాను, నాకు అధికారం ఉంది అని అనుకోకండి. నా అన్న పదం ఎక్కడి నుండి వచ్చింది? అది మీదా? మూటను సంభాళించుకుని పెట్టుకున్నారా ఏమిటి? చాలామంది పిల్లలు ఎటువంటి నషాను చూపిస్తారంటే, మేము సెంటరు యొక్క భవనాన్ని తయారుచేసాము కనుక మాకు అధికారము ఉంది. కానీ తయారుచేసింది ఎవరి సెంటరును? బాబా సెంటరు కదా! కావున ఎప్పుడైతే బాబాకు అర్పణ చేసారో, అప్పుడిక మీది ఎక్కడి నుండి వచ్చింది? నాది అన్నది ఎక్కడి నుండి వచ్చింది? బుద్ధి మారినప్పుడు నాది అని అంటారు. నాది-నాది అన్నదే మురికిగా చేసింది, ఇంకా మురికిగా అవ్వాలా? బ్రాహ్మణులుగా అయినప్పుడు బ్రాహ్మణ జీవితంలో తండ్రితో చేసిన మొదటి ప్రతిజ్ఞ ఏమిటి? కొత్తవారు ప్రతిజ్ఞ చేసారా లేక పాతవారు చేసారా? కొత్తవారు కూడా ఇప్పుడు పాతవారిగా అయి వచ్చారు కదా? నిశ్చయబుద్ధి యొక్క ఫారమును నింపి వచ్చారు కదా? కనుక అందరి మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏమిటంటే - తనువు, మనసు, ధనము మరియు బుద్ధి అన్నీ మీవే. ఈ ప్రతిజ్ఞను అందరూ చేసారా?
ఇప్పుడు ప్రతిజ్ఞను చేసేవారైతే చేతులెత్తండి. ఎవరైతే ఇలా భావిస్తారో - అవసరమైన సమయానికి ఎంతో కొంత ఉంచుకోవాల్సి ఉంటుంది, అంతా తండ్రికి ఎలా ఇచ్చేస్తాము? ఎంతో కొంత పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇది తెలివైన పని అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. ఏదైనా పక్కకు పెట్టుకున్నారా? చూసుకోండి, మళ్ళీ తర్వాత మమ్మల్ని ఎవరు చూసారు, ఇంత గుంపులో మమ్మల్ని ఎవరు చూసారు అని అనకండి. తండ్రి వద్దనైతే టి.వి చాలా స్పష్టంగా ఉంది. దాని నుండి దాగి ఉండలేరు. అందుకే ఆలోచించి, అర్థం చేసుకుని కొద్దిగా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి. పాండవులు ఏమనుకుంటున్నారు? కొద్దిగా ఉంచుకోవాలా? బాగా ఆలోచించండి. ఎవరైతే పెట్టుకోవాలి అనుకుంటారో వారు ఇప్పుడే చేతులెత్తండి, రక్షించబడతారు. లేదంటే ఈ సమయము, ఈ సభ, మీరు ఈ విధంగా తల ఊపడము, ఇవన్నీ కనిపిస్తాయి. ఎప్పుడూ కూడా నాది అన్నది పెట్టుకోకండి. తండ్రి అని అన్నట్లయితే పాపం సమాప్తమైపోతుంది. తండ్రి అని అనకపోతే పాపమవుతుంది. పాపానికి వశమైతే ఇక బుద్ధి పని చేయదు. ఇక ఎంతగా అర్థం చేయించినా - కాదు, ఇదే రైటు ఇలా జరగాల్సిందే, ఇలా చేయాల్సిందే అని అంటారు. తండ్రికి కూడా దయ కలుగుతుంది ఎందుకంటే ఆ సమయంలో పాపానికి వశమై ఉంటారు. తండ్రిని మర్చిపోతే పాపం వచ్చేస్తుంది. పాపానికి వశమైన కారణంగా ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చేస్తారో - మేము ఏం చేస్తున్నాము అన్నది స్వయానికి కూడా అర్థం కాదు ఎందుకంటే పరవశులై ఉంటారు. కనుక సదా జ్ఞానం యొక్క తెలివిలో ఉండండి. పాపం యొక్క ఆవేశంలోకి రాకండి. మధ్యమధ్యలో ఈ మాయ అల వస్తుంది. కొత్తవారైన మీరు ఈ విషయాల నుండి రక్షించబడి ఉండండి. నాది-నాది అన్నదానిలోకి వెళ్ళకండి. కొద్దిగా పాతవారిగా అయిన తర్వాత ఇక ఈ నాది-నాది అన్న మాయ చాలా వస్తుంది. నా ఆలోచన అని అంటారు, నా బుద్ధి అన్నదే లేనప్పుడు ఇక నా ఆలోచన అన్నది ఎక్కడి నుండి వచ్చింది? మరి జమ చేసుకునే విధి ఏమిటో అర్థమయిందా? కార్యంలో ఉపయోగించడము. సఫలం చేసుకోండి, తమ ఈశ్వరీయ సంస్కారాలను కూడా సఫలం చేసుకోండి, అప్పుడు వ్యర్థ సంస్కారాలు స్వతహాగా వెళ్ళిపోతాయి. ఈశ్వరీయ సంస్కారాలను కార్యంలో ఉపయోగించకపోతే, అవి లాకర్లో ఉంటాయి మరియు పాతవి పని చేస్తూ ఉంటాయి. చాలామందికి బ్యాంకులలో లేక అల్మరాలలో పెట్టుకునే అలవాటు ఉంటుంది. చాలా మంచి వస్త్రాలుంటాయి, ధనం ఉంటుంది, వస్తువులు ఉంటాయి, కానీ పాతవాటిని ఉపయోగిస్తారు. పాత వస్తువుల పట్ల వారికి ప్రేమ ఉంటుంది మరియు అల్మరాలోని వస్తువులు అల్మరాలోనే ఉంటాయి మరియు పాతవాటితోనే వారు వెళ్ళిపోతారు. కావున పాత సంస్కారాలను ఉపయోగిస్తూ ఈశ్వరీయ సంస్కారాలను బుద్ధి అనే లాకర్లో పెట్టుకోకండి, ఇలా చేయకండి. కార్యంలో ఉపయోగించండి, సఫలం చేసుకోండి. కావున ఎంత సఫలం చేసుకున్నాము అన్న చార్టును పెట్టుకోండి. సఫలం చేసుకోవడము అనగా పొదుపు చేయడము లేక పెంచుకోవడము. మనసా ద్వారా సఫలం చేసుకోండి, వాణి ద్వారా సఫలం చేసుకోండి. సంబంధ-సంపర్కాల ద్వారా, కర్మల ద్వారా, తమ శ్రేష్ఠ సాంగత్యం ద్వారా, తమ అత్యంత శక్తిశాలి వృత్తి ద్వారా సఫలం చేసుకోండి. నా వృత్తి అయితే మంచిగా ఉంటుంది అని కాదు. కానీ సఫలం ఎంత చేసుకున్నారు? నా సంస్కారాలైతే శాంతిగా ఉంటాయి అని కాదు కానీ సఫలం ఎంత చేసుకున్నారు? కార్యంలో ఉపయోగించారా? కావున ఈ విధిని అలవర్చుకోవడంతో సంపూర్ణత యొక్క సిద్ధిని సహజంగా అనుభవం చేస్తూ ఉంటారు. సఫలం చేసుకోవడమే సఫలత యొక్క తాళంచెవి. ఏం చేయాలో అర్థమయిందా? కేవలం మీలో మీరే ఇలా సంతోషపడుతూ ఉండకండి - నేనైతే చాలా మంచి గుణవంతుడను, నేను చాలా బాగా భాషణ చేయగలను, నేను చాలా మంచి జ్ఞానిని, యోగం కూడా నాది చాలా బాగుంటుంది. కానీ బాగుంటే దానిని ఉపయోగించండి కదా. దానిని సఫలం చేయండి. కార్యంలో ఉపయోగించడము మరియు పెంచుకోవడమే సహజ విధి. ఇలా చేస్తే ఏ శ్రమ లేకుండా పెరుగుతూ ఉంటుంది మరియు 21 జన్మలు ప్రశాంతంగా తినండి. అక్కడ శ్రమించాల్సిన అవసరం ఉండదు.
ఇది విశాలమైన సభ (ఓం శాంతి భవన్ యొక్క హాలు పూర్తిగా నిండిపోయింది, అందుకే చాలామందికి కింద మెడిటేషన్ హాలులో, చిన్న హాలులో కూర్చోవాల్సి వచ్చింది. హాలు చిన్నదైపోయింది). శాస్త్రాలలో మీ స్మృతిచిహ్నం ఏదైతే ఉందో, అందులో కూడా ఇలా గాయనం ఉంది - మొదట గ్లాసులో నీటిని వేసారు, ఆ తర్వాత దాని నుండి కుండలో వేసారు, ఆ తర్వాత కుండ నుండి చెరువులో వేసారు, చెరువు నుండి నదిలో వేసారు. చివరికి ఎక్కడికి వెళ్ళింది? సాగరములోకి. అలాగే ఈ సభ మొదట హిస్టరీ హాలులో జరిగేది, ఆ తర్వాత మెడిటేషన్ హాలులో జరిగేది, ఇప్పుడు ఓం శాంతి భవన్లో జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఎక్కడ ఉంటుంది? కానీ అలాగని సాకార మిలనం లేకుండా అవ్యక్త మిలనం జరుపుకోలేరని కాదు. అవ్యక్త మిలనాన్ని జరుపుకునే అభ్యాసము సమయమనుసారంగా పెరగాల్సిందే మరియు పెంచుకోవాల్సిందే. ఇక్కడ దాదీలు దయాహృదయులై కొత్తవారైన మీ అందరిపై విశేషమైన దయ చూపించారు. కానీ అవ్యక్త అనుభవాన్ని పెంచుకోండి - ఇదే సమయానికి పనికొస్తుంది. చూడండి, కొత్త-కొత్త పిల్లల కోసమే బాప్‌దాదా విశేషంగా ఈ సాకార మిలనము యొక్క పాత్రను ఇప్పటివరకు అభినయిస్తున్నారు. కానీ ఇది కూడా ఎప్పటివరకు?
అందరూ సంతోషంగా, సంతుష్టంగా ఉన్నారా? బయట ఉండడంలో కూడా సంతుష్టంగా ఉన్నారా? ఇది కూడా డ్రామాలోని పాత్ర. మొత్తం ఆబూ అంతా మాదిగా అవుతుంది అని అంటారు కదా, మరి అది ఎలా అవుతుంది? మొదట మీరైతే పాదం పెట్టండి, ఆ తర్వాత ఇప్పుడు ఏవైతే ధర్మశాలల పేరుతో ఉన్నాయో అవి మీవిగా అవుతాయి. చూడండి, విదేశాలలో ఇప్పుడు ఈ విధంగా జరగడం ప్రారంభమయింది. చర్చిలు అంతగా నడవకపోతుంటే, వాటిని బి.కె.లకు ఇచ్చేసారు. ఇటువంటి పెద్ద-పెద్ద స్థానాలు ఏవైతే ఉన్నాయో, అవి నడవలేకపోతే వాటిని ఆఫర్ చేస్తారు కదా. కనుక ప్రతి స్థానంలోనూ బ్రాహ్మణుల అడుగులు పడుతున్నాయి, ఇందులో కూడా రహస్యముంది. బ్రాహ్మణులకు డ్రామాలో ఈ విధంగా ఉండే పాత్ర లభించింది. కావున మొత్తమంతా మీదిగా అయినప్పుడు ఏం చేస్తారు? తమంతట తామే ఆఫర్ చేస్తారు - మీరు సంభాళించండి, మమ్మల్ని కూడా సంభాళించండి, ఆశ్రమాన్ని కూడా సంభాళించండి. ఏ సమయంలో ఏ పాత్ర లభిస్తే, దానితో రాజీగా ఉంటూ పాత్రను అభినయించండి. అచ్ఛా.
మధుబన్ నివాసులు మరియు టీచర్లు అందరూ కింద కూర్చుని వింటున్నారు. వినడం ద్వారా కలుస్తున్నారు. టీచర్లు మరియు మధుబన్ నివాసులకు సేవ యొక్క ప్రత్యక్ష ఫలంగా అందరి సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ బ్రాహ్మణ ఆత్మల లేదా బాబా యొక్క ఆశీర్వాదాలు ఎక్స్ట్రా లిఫ్ట్ రూపంలో పనికి వస్తాయి. ఈ బ్రాహ్మణ ఆత్మల హృదయపూర్వక ఆశీర్వాదాలు తక్కువేమీ కాదు. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ మిలనం జరుపుకునే, జ్ఞాన రత్నాలను ధారణ చేసే చాతక ఆత్మలకు, ఆకార రూపంలో లేక సాకార రూపంలో మిలన మేళాను జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా సర్వ ఖజానాలను సఫలం చేసుకుని సఫలతా స్వరూపులుగా అయ్యే ఆత్మలకు, సదా నా బాబా అని అనుకునేవారికి మరియు ఎటువంటి హద్దులోని నాది అనేది అంశమాత్రము కూడా ఉంచుకోని అనంతమైన వైరాగీ ఆత్మలకు, సదా ప్రతి సమయము విధి ద్వారా సంపూర్ణత అనే సిద్ధిని ప్రాప్తి చేసుకునే పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- సదా ఏదో ఒక కొత్త దృశ్యము ఉండాలి కదా. ఇప్పుడు ఏదైతే రిపీట్ అయ్యిందో, అది కూడా డ్రామాలోని కొత్త దృశ్యము. ఈ హాలు కూడా చిన్నదిగా అయిపోతుంది అని అనుకున్నారా? సదా ఒకే దృశ్యముంటే బాగా అనిపించదు. అప్పుడప్పుడు వచ్చే దృశ్యాలు బాగా అనిపిస్తాయి. ఇది కూడా ఒక ఆత్మిక మెరుపు కదా! ఈ ఆత్మలందరి సంకల్పము పూర్తి అయ్యేదే ఉంది, అందుకే ఈ దృశ్యము జరిగింది. సరే రండి, అని ఇక్కడి నుండి అనుమతి ఇచ్చారు. అప్పుడిక ఏం చేస్తారు? ఇప్పుడింకా కొత్తవారు ఇంకా పెరగనున్నారు. మరియు పాతవారైతే పాతవారిగా అయ్యారు. ఎంతైతే ఉత్సాహంతో వచ్చారో, అలా స్వయాన్ని సెట్ చేసుకున్నారు, మంచి పని చేసారు. ఇది విశాలంగా అయితే అవ్వాల్సిందే. ఇంకా చిన్నదిగా అయితే అయ్యేదే లేదు. విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ ఉన్నప్పుడు విశ్వం ముందు ఇది ఏమీ కానే కాదు. వృద్ధి కూడా జరగనున్నది మరియు విధిలో కూడా ఇంకా-ఇంకా కొత్తగా అవ్వనున్నది. ఏదో ఒక కొత్త విధి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు వృత్తి శక్తిశాలిగా అవుతుంది. తపస్సు ద్వారా వృత్తి శక్తిశాలిగా అయితే స్వతహాగా వృత్తి ద్వారా ఆత్మల వృత్తి కూడా పరివర్తనవుతుంది. అచ్ఛా, మీరందరూ సేవ చేస్తూ అలసిపోవడం లేదు కదా. ఆనందంలో ఉన్నారు కదా. ఆనందమే ఆనందము. అచ్ఛా.
పార్టీలతో :- సదా తమను తాము ఏకరస స్థితిలో అనుభవం చేసుకుంటున్నారా? ఏకరస స్థితి ఉందా లేక ఇతర హద్దు రసాలు ఆకర్షిస్తున్నాయా? నిరంతర యోగిగా అయ్యారా? సదా పవర్ఫుల్ యోగం ఉందా లేక తేడా వస్తుందా? నిరంతరం అనగా అంతరం లేకపోవడం. ఇంతటి శక్తిశాలిగా అయ్యారా లేక అవుతున్నారా? ఎంతవరకు అయ్యారు? 75 శాతం వరకు చేరుకున్నారా? ఎందుకంటే సదా ఏకరసం అనగానే ఒక్కరితో సదా తండ్రి ఎలాగో, నేను అలాగే, తండ్రి సమానంగా ఉండడము. అవ్వడం అయితే తండ్రి సమానంగానే అవ్వాలి. తండ్రి అయితే శక్తిని నింపుతూనే ఉంటారు. రోజూ మురళి ఏమిటి? శక్తిని నింపుతుంది కదా! కానీ నింపుకునేవారు నింపుకుంటారు. మనం మహావీరులము, శివశక్తులము అని సదా స్మృతి ఉంచుకోండి, అప్పుడు ఎన్నడూ నిర్బలులుగా అవ్వరు, బలహీనపడరు. ఎందుకంటే బలహీనపడినప్పుడే ఏదైనా విఘ్నం వస్తుంది. ఒకవేళ బలహీనపడకపోతే విఘ్నం రాలేదు. మహావీరుడిని విఘ్న-వినాశకుడు అంటారు. మరి ఇది ఎవరి టైటిల్? మీరందరూ విఘ్న-వినాశకులా లేక విఘ్నాలలో కంగారుపడేవారా? ఏ ఒక్క శక్తి తగ్గినా మాస్టర్ సర్వశక్తిమాన్ అని అనరు. అందువలన సర్వ శక్తులు తండ్రి ఆస్తి అని సదా గుర్తుంచుకోండి. ఆస్తి పూర్తిగా లభించిందా లేక కొద్దిగా లభించిందా? కాబట్టి ఒక్క శక్తి కూడా తక్కువగా ఉండకూడదు. ఈ సమయంలో అందరూ మధుబన్ నివాసులు కదా! ఇప్పుడు మధుబన్ను వెంట తీసుకువెళ్ళండి. ఎందుకంటే మధుబన్ అనగా మధురత. మధుబన్ మీ వెంట ఉంటే సదా సంపూర్ణంగా మరియు సదా సంతుష్టంగా ఉంటారు. మధుబన్‌లో చాలా బాగుండేది, ఇప్పుడు మారిపోయాము అని అలా అనకూడదు. మధుబన్ బాబా కూడా తోడున్నారు. కాబట్టి మధుబన్ విశేషత కూడా వెంట ఉంది. అప్పుడు సదా తమను తాము మాస్టర్ సర్వశక్తిమాన్గా అనుభవం చేసుకుంటారు. అందరూ తీవ్ర పురుషార్థులా లేక పురుషార్థులా? తీవ్ర పురుషార్థి గుర్తు ఏమిటి? తీవ్ర పురుషార్థి సదా ఎగిరే కళ కలవారిగా ఉంటారు, సదా డబల్ లైట్‌గా ఉంటారు. అప్పుడప్పుడు పైన, అప్పుడప్పుడు కింద కాదు, సదా ఎగిరే కళ. విచిత్రమైన తండ్రితో ఎంతెంత ప్రేమ ఉంటుందో, మరి ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో అలాగే తయారవ్వాల్సి ఉంటుంది. స్వయంగా కూడా విచిత్ర ఆత్మ రూపంలో స్థితులైతే ఎగిరే కళలో ఉంటారు. అచ్ఛా!
(డబల్ విదేశీ సోదర-సోదరీల పట్ల బాప్‌దాదా యొక్క మధుర ప్రియస్మృతుల పత్రము)
నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు ప్రియుడైన బాప్‌దాదా హృదయం నుండి చాలా-చాలా ప్రియస్మృతులు స్వీకారం అగుగాక.
సర్వ పిల్లల మధుబన్ రిఫ్రెష్మెంట్ యొక్క ఉల్లాస-ఉత్సాహాల సువాసన ఉత్తరాల ద్వారా, ఆత్మిక సంభాషణ ద్వారా తండ్రి వద్దకు చేరుతోంది. పిల్లల తీవ్ర పురుషార్థాన్ని చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు సదా ముందుకు ఎగిరేందుకు సహచరుడుగా ఉన్నారు. ఈశ్వరీయ కుటుంబ సహయోగపు ఆశీర్వాదాలు కూడా సదా అందరితోనూ ఉన్నాయి. చూడండి, మధురమైన పిల్లలు ఈ తపస్యా సంవత్సరంలో లగ్నం అనే అగ్ని ద్వారా సర్వ వ్యర్థ సంకల్పాలను, సమయాన్ని మరియు సంస్కారాలను సమాప్తం చేసి సమర్థ సంపన్నంగా మారేందుకు ఏదైతే దృఢ సంకల్పం చేశారో, దానిని తమ ధైర్యము మరియు తండ్రి సహాయంతో పూర్తి చేయాల్సిందే మరియు జరిగే ఉంది. దీని కొరకు సదా తండ్రిని తమ కంపానియన్‌గా తోడుంచుకోవాలి మరియు తీవ్ర పురుషార్థీలైన, ఫాలో ఫాదర్ చేసే బ్రాహ్మణ ఆత్మల కంపెనీని (సాంగత్యాన్ని) చేసుకోవాలి. దీని ద్వారానే సహజ సఫలతను అనుభవం చేసుకుంటూ ఉంటారు. డబల్ విదేశీ పిల్లలపై తండ్రికి విశేష ప్రేమ ఉంది, ఎందుకంటే పిల్లలు కూడా తండ్రి ప్రేమలో లీనమై ఉంటారు. ఎగురుతూ ఉండండి మరియు ఎగరిస్తూ ఉండండి. అచ్ఛా.
(6-4-91 న విశేషంగా దాదీజీ మరియు దాదీ జానకీజీని కలిసేందుకు దీదీ గదిలోకి బాప్‌దాదా విచ్చేశారు)
కర్మాతీత స్థితికి సమీపంగా వస్తున్నారు. కర్మలు కూడా వృద్ధిని పొందుతూ ఉంటాయి. కానీ కర్మాతీతము అనగా కర్మ యొక్క ఏ బంధనపు స్పర్శకూ అతీతంగా ఉండటము. ఇలాంటి అనుభవమే పెరుగుతూ ఉండాలి. ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా కర్మ చేశాను కదా అన్నట్లుగా, అలా అతీతభావం ఉండాలి. అటు కార్యాన్ని స్పర్శించడం కానీ మరియు చేసిన తర్వాత వచ్చిన ఫలితం - ఆ ఫలాన్ని పొందే విషయంలోనూ అతీతభావం ఉండాలి. కర్మ ఫలము అనగా వచ్చే రిజల్ట్ యొక్క స్పర్శ కూడా ఉండకూడదు, పూర్తిగా అతీతమైన అనుభవమే కలుగుతూ ఉండాలి. ఎవరో చేయిస్తే నేను చేశాను అన్నట్లుగా. ఎవరో చేయించారు మరియు నేను నిమిత్తమయ్యాను. కానీ నిమిత్తంగా అవ్వడంలోనూ అతీతభావం ఉండాలి. ఇలాంటి కర్మాతీత స్థితి పెరుగుతూ పోతోంది - అని ఫీల్ అవుతుందా?
మహారథుల స్థితి ఇతరుల కంటే అతీతంగా మరియు ప్రియంగా స్పష్టమవుతుంది కదా. బ్రహ్మా బాబా ఎలాగైతే స్పష్టంగా ఉండేవారో, అలాగే నంబరువారీగా నిమిత్త ఆత్మలైన మీరు కూడా సాకార స్వరూపం ద్వారా స్పష్టమవుతూ వస్తున్నారు. కర్మాతీతము అనగా అతీతంగా మరియు ప్రియంగా ఉండటము. కర్మలు ఇతరులూ చేస్తారు మరియు మీరూ చేస్తారు, కానీ మీ కర్మ చేయడంలో తేడా ఉంది. స్థితిలో తేడా ఉంది. ఏది గడిచినా అతీతంగా అయిపోతారు. కర్మ చేశారు మరియు అది పూర్తయ్యాక ఏమీ చేయనట్లే అని అనుభవమవుతుంది. చేయించేవారు చేయించుకున్నారు. ఇలాంటి స్థితి అనుభవాన్ని చేసుకుంటూ ఉంటారు. తేలికదనం ఉంటుంది. కర్మ చేస్తున్నప్పుడు తనువులోనూ తేలికదనం, మనస్సు స్థితిలోనూ తేలికదనం ఉంటుంది. కర్మ ఫలితం మనస్సును లాగేస్తుంది. అలాంటి స్థితి ఉందా? కార్యం ఎంతగా పెరుగుతూ పోతుందో తేలికదనం కూడా అంతగా పెరుగుతూ పోతుంది. కర్మ తన వైపుకు ఆకర్షించదు, కానీ యజమానిగా అయి కర్మ చేయించేవారు చేయిస్తున్నారు మరియు నిమిత్తంగా ఉండేవారు నిమిత్తమై చేస్తున్నారు.
ఆత్మ యొక్క తేలికతనానికి గుర్తు - ఆత్మ యొక్క విశేష శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు, ఈ మూడూ కూడా అలా తేలికగా మారిపోతూ ఉంటాయి. సంకల్పాలు కూడా పూర్తిగా తేలికపాటి స్థితి అనుభవాన్ని కలిగిస్తాయి. బుద్ధి నిర్ణయ శక్తి కూడా ఏమీ చేయనట్లుగానే నిర్ణయం చేస్తుంది, మరియు ఏ సంస్కారమూ తన వైపుకు ఆకర్షించదు. తండ్రి సంస్కారాలే పనిచేస్తున్నట్లుగా ఉంటాయి. సూక్ష్మ శక్తులైన ఈ మనస్సు-బుద్ధి-సంస్కారాలు మూడింటిలోనూ లైట్‌గా (తేలికగా) అనుభవం చేసుకుంటారు. తండ్రి ఎలాగో పిల్లలు అలాగే అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు అని అందరి హృదయం నుండి, నోటి నుండి స్వతహాగానే వస్తూ ఉంటుంది. ఎందుకంటే సమయానుసారంగా బయటి వాతావరణం రోజురోజుకూ మరింత భారంగా మారుతూ ఉంటుంది. బయటి వాతావరణం ఎంత భారంగా మారుతుందో, అనన్య పిల్లల సంకల్పాలు, కర్మలు, సంబంధాలు అంత లైట్‌గా (తేలికగా) మారుతూ ఉంటాయి మరియు ఈ లైట్నెస్ కారణంగా మొత్తం కార్యం లైట్‌గా నడుస్తూ ఉంటుంది. వాతావరణం తమోప్రధానం కావడం వల్ల భిన్న రకాలుగా భారీతనాన్ని అనుభవిస్తారు. ప్రకృతిలోనూ భారీతనము ఉంటుంది. మనుష్యాత్మల వృత్తులలోనూ భారీతనము ఉంటుంది. దీని కొరకు కూడా ఎంతో తేలికదనం ఇతరులను కూడా తేలిక చేస్తుంది. మంచిది, అంతా బాగుంది కదా. కార్యవ్యవహారాల ప్రభావం మీపై పడదు. కానీ మీ ప్రభావం కార్యవ్యవహారాలపై పడుతుంది. ఏది చేసినా, ఏది విన్నా మీ తేలికపాటి స్థితి ప్రభావం కార్యంపై పడుతుంది. కార్యం యొక్క అలజడి ప్రభావం మీపైకి రాదు. అచల స్థితి కార్యాన్ని కూడా అచలంగా మారుస్తుంది. అన్ని విధాలుగా అసంభవం అనిపించిన కార్యాలూ సంభవంగా మరియు సహజంగా మారుతున్నాయి మరియు మారుతూ ఉంటాయి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
